Friday 17 June 2016

MOPADU Village About Mopadu Village

    మోపాడు గురించి 

మోపాడు  గ్రామం ప్రకాశం  జిల్లా లో  ఒక అందమైన  పల్లెటూరు . ఈ గ్రామం పూర్వం రోజులలో బ్రిటిష్ వారు ఇక్కడ నివాసం ఏర్పరుచుకొని పరిపాలన చేశారు అంతే కాకుండా ఈ గ్రామానికి పైన ఒక పెద్ద చెరువు ని నిర్మించి,పంటల్ని పండించే రైతుల నుంచి శిస్తు వాసులు చేసి ఆదాయం పొందేవారు వారు ఆ రోజులలో నిర్మించిన  చెరువు (Reservoir ) ఇప్పటికి ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే  ఉంది . 1995-1996 మధ్య కాలంలో వచ్చిన వరదలలో చెరువు కు గండి పడడం వలన  సుమారు 300 నుంచి 400 జనాభా మరణించారు . గ్రామ జనాభా తమ నివాసాలను మార్చుకొని ప్రక్క గ్రామాలకు వలస వెళ్లారు .                                      

                   

                                        మోపాడు గ్రామం వరి పంటకు ప్రకాశం జిల్లాలో బాగా ప్రసిద్ధి. మోపాడు చెరువు మీద ఆధారపడి సుమారు 20,000 ఎకరాల వరి పంట పండిస్తారు, చెరువు లో నీరు మీద ఆధారపడి ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తారు . ఈ గ్రామం లో సుమువారు 1500 జనాభా నివాసం ఉంటారు ఎక్కువ మంది  వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు . ఈ గ్రామం రాజధాని కి 250 కి.మీ దూరం లో , జిల్లా ముఖ్య నగరం ఒంగోలు కు 95 కి .మీ దూరం లో ఉంది . ఈ గ్రామానికి 9 కి.మీ దగ్గరలో ఉన్న పట్టణం పామూరు. ఈ గ్రామం కనిగిరి నియోజకవర్గం లో భాగం ,ఒంగోలు పార్లమెంట్ లో ఒక భాగం.  ఈ ఊరిలో జన్మించిన ఇరిగినేని తిరుపతి నాయుడు గారు కనిగిరి నియోజకవర్గం కు మూడు సార్లు ఎమ్మెల్యే గా పని చేశారు . కనిగిరి నియోజకవర్గం కు   జరిగే ఎన్నికలలో మోపాడు పంచాయతి ముఖ్య భూమిక పోషితుంది  . 


                                                          మోపాడు గ్రామానికి రాష్ట్ర నలుమూలల నుంచి బస్ సౌకర్యం కలదు. ఒంగోలు నుంచి ప్రతి అరగంటకు ఒక బస్ సౌకర్యం కలదు . గ్రామ పిన్ కోడ్ 523110. గ్రామ ల్యాండ్ లైన్ పిన్ కోడ్ 08490